NTR: నందిగామ నియోజకవర్గం సంబంధించి మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా, కోటి సంతకాలు ప్రజా ఉద్యమం పోస్టర్ను మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్మోహనరావు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈనెల 28న మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ నిర్వహిస్తున్న “ప్రజా ఉద్యమ” విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.