ATP: 11 రోజులుగా గుంతకల్లు మున్సిపల్ కార్యాలయం ఎదుట నిర్వహించిన దీక్షలను సీపీఐ నాయకులు శుక్రవారం విరమించారు. ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం నిమ్మరసం ఇచ్చి విరమింపజేశారు. సమస్యలన్నింటినీ ఏడాదిలోగా పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు. సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు దేవరగుడి జగదీశ్, ఎమ్మెల్యే జయరాం తదితర నాయకులు దీక్ష విరమణలో పాల్గొన్నారు.