KRNL: శ్రీ సాయి కృష్ణ డిగ్రీ కళాశాలలో ఈ నెల 30న జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డి, స్కిల్ అభివృద్ధి అధికారి ఆనంద్ రాజ్ కుమార్ తెలిపారు. పదో తరగతి నుంచి డిగ్రీ వరకు చదువుకున్న 18 నుంచి 35 ఏళ్ల వయసు కలిగిన అభ్యర్థులు మేళాలో పాల్గొనవచ్చన్నారు. 15 ప్రముఖ కంపెనీల ప్రతినిధులు హాజరుకానున్నారని పేర్కొన్నారు.