HYD: రాంకీ సంస్థకు మరోసారి జీహెచ్ఎంసీ జరిమానా విధించింది. సక్రమంగా చెత్తను తొలగించని కారణంగా జరిమానా వేసినట్లు జూబ్లీహిల్స్ కమిషనర్ సమ్మయ్య తెలిపారు. పలుచోట్ల 60 నుంచి 70% చెత్తను మాత్రమే తొలగిస్తున్నట్లు గుర్తించి చర్యలు తీసుకున్నామన్నారు. ఈ కారణంగా శుక్రవారం రూ.1.20 లక్షలు జరిమానా వేసినట్లు వివరించారు.