WGL: ఉమ్మడి జిల్లాలో నాగుల చవితి పండుగ భక్తిశ్రద్ధలతో కొనసాగుతోంది. కార్తీక మాసంలో జరిగే ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని దేవాలయాలు భక్తులతో కిక్కిరిశాయి. హనుమకొండ వేయిస్తంభాల గుడి, వరంగల్ ఫోర్ట్ నాగులగుట్ట, భూపాలపల్లి, మహబూబాబాద్, జనగామ ప్రాంతాల్లో మహిళలు నాగదేవతలకు పాలు, గంధం, పువ్వులు సమర్పించి పూజలు చేస్తున్నారు.