ASF: కుటుంబ కలహాలతో క్షణికావేశంలో ఆత్మహత్య చేసుకునేందుకు వెళ్లిన వ్యక్తి ప్రాణాలను రెబ్బెన ఎస్సై వెంకటకృష్ణ కాపాడారు. రాజురాకు చెందిన కురాట్ కార్ శ్యామ్ రావు అనే వ్యక్తి కుటుంబ కలహాలతో ఆత్మహత్య చేసుకుంటానని శుక్రవారం ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. ఎస్సైకి కుటుంబ సభ్యులు సమాచారం ఇవ్వడంతో రైల్వే ట్రాక్‌పై వెళ్తుండగా పట్టుకొని కుటుంబ సభ్యులకు అప్పగించారు.