కోనసీమ: వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో నిర్వహించే నిత్యాన్నదాన పథకానికి శనివారం రావులపాలెంకి చెందిన కంటిపూడి సాయిరాం, పుష్పవతి దంపతులు రూ. 50,116, అదే గ్రామానికి చెందిన కూసుమంచి గంగాధర్ రావు, కామేశ్వరి దంపతులు రూ. 38,116 విరాళాన్ని ఆలయ అధికారులకు అందజేశారు. దాతలకు ఆలయ అధికారులు స్వామి వారి చిత్రపటం, ప్రసాదం అందజేశారు.