TG: సీఎం రేవంత్ రెడ్డి కాసేపట్లో ఢిల్లీకి వెళ్లనున్నారు. ఉదయం 9:30 గంటలకు బయలుదేరనున్నారు. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షుల నియామకాలపై కాంగ్రెస్ పెద్దలతో భేటీ కానున్నారు. మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో సమావేశం అవుతారు. ఏఐసీసీ పరిశీలకుల నివేదికను సమర్పించే అవకాశం ఉంది. డీసీసీ అధ్యక్షుల తుది జాబితా ఫైనల్ చేసే ఛాన్స్ ఉంది. ఈ సమావేశంలో మీనాక్షి, మహేశ్ కుమార్ గౌడ్ పాల్గొననున్నారు.