తిరుపతి: రాయల చెరువు సమీపంలోని యోగుల పర్వతంపై నవంబర్ 5న బుధవారం రోజు కార్తీక పౌర్ణమి వేడుకలు నిర్వహించనున్నట్టు ఏకవీర సేవా ఫౌండేషన్ వ్యవస్థాపకులు ప్రతాప్ స్వామి తెలిపారు. సాయంత్రం 6 గంటలకు ఎత్తైన ప్రదేశం నుంచి తిరుపతి, శ్రీకాళహస్తి, నగరి, చంద్రగిరి, ప్రాంత ప్రజలను కనువిందు చేసేలా కార్తీక దీపోత్సవం నిర్వహిస్తామన్నారు.