అన్నమయ్య: కోడూరులో కురిసిన భారీ వర్షాలకు గుంజనీరు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. శుక్రవారం ఛైర్మన్ ముక్కారూపానంద రెడ్డి వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు. ఈ మేరకు రెడ్డివారి పల్లి బ్రిడ్జ్, గుర్రప్పాలెం వెళ్లే బ్రిడ్జ్, నరసరాంపేట తదితర ప్రాంతాలను పరిశీలించారు. దెబ్బతిన్న బ్రిడ్జి మరమ్మతు పనులను వెంటనే ప్రారంభించాలని స్థానిక అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.