WGL: గ్రేటర్ వరంగల్ మునిసిపల్ కార్పొరేషన్ 17వ డివిజన్లో ప్రతి ఇంటికి తడి, పొడి చెత్త బుట్టలను కార్పొరేటర్ గద్దె బాబు శుక్రవారం పంపిణీ చేశారు. ప్రజలు చెత్తను వేరు చేసి మునిసిపల్ వాహనాలకు ఇవ్వాలని, ఇళ్లు మాత్రమే కాదు పట్టణం కూడా పరిశుభ్రంగా ఉంచాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో స్థానిక నేతలు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.