కృష్ణా: గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గుడివాడ పట్టణ ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము మున్సిపల్ అధికారులను శుక్రవారం ఆదేశించారు. ఎక్కడైనా నీరు నిల్వ ఉండడం వంటి సమస్యలు తలెత్తకుండా వెంటనే చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ నేపథ్యంలో గుడివాడ పురపాలక సంఘం వద్ద కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు.