NLG: జిల్లాలో మైనర్ బాలికపై అత్యాచారం కేసులో ఇవ్వాళ కోర్టు కీలక తీర్పు ఇచ్చింది. 2022లో జరిగిన ఈ ఘటనలో కట్టంగూరు మండలానికి చెందిన యువకుడు నగేశ్‌కు 21 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. నిందితుడికి రూ. 30వేల జరిమానాతో పాటు, బాధితురాలికి రూ. 10లక్షల పరిహారం ఇవ్వాలని కోర్టు ఆదేశించింది.