AP: ప్రైవేట్ ట్రావెల్స్ బాధితుల సంఘం అధ్యక్షుడు సుధాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. AC బస్సుల్లో 32 సీట్లు మించొద్దని.. మరి 42 మంది ఎందుకున్నారని ప్రశ్నించారు. ప్రైవేట్ ట్రావెల్స్ కాంట్రాక్ట్ క్యారియర్స్ రద్దు చేయాలన్నారు. ప్రైవేట్ ట్రావెల్స్.. దేశంలోనే అతిపెద్ద మాఫియా అని మండిపడ్డారు. ప్రతి ప్రైవేట్ ట్రావెల్స్ వెనకా పొలిటికల్ లీడర్లే ఉంటున్నారని ఆరోపించారు.