VKB: మత్స్యకారుల ఆర్థిక స్థితిని బలోపేతం చేయడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. ప్రభుత్వం చేపట్టిన ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమంలో భాగంగా కోట్ పల్లి చెరువులో నేడు చేప పిల్లలను వదిలారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి, ఫిషరీస్ ఛైర్మన్ మెట్టు సాయి, ముదిరాజ్ కార్పొరేషన్ ఛైర్మన్ పాల్గొన్నారు.