ప్రకాశం: నాగులుప్పలపాడు మండలంలోని చదలవాడ, హనుమాపురం, కొత్తకోట వాగులను ఒంగోలు డీఎస్పీ శ్రీనివాసరావు గురువారం పరిశీలించారు. జోరుగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో నాగులుప్పలపాడు మండలంలోని పలు వాగుల వద్ద నీటి ప్రవాహం కనిపించింది. దీంతో స్థానిక SI రజియా సుల్తానాతో కలిసి డీఎస్పీ శ్రీనివాసరావు వాగుల వద్ద తాజా పరిస్థితిని సమీక్షించారు.