KMM: కార్తీక మాసం సందర్భంగా భక్తుల కోరిక మేరకు పలు పుణ్యక్షేత్రాలకు బస్సులు నడుపుతున్నట్లు మధిర డిపో మేనేజర్ డి.శంకర్ రావు తెలిపారు. శుక్రవారం మధిరలో ప్రత్యేక బస్సులకు సంబంధించిన పోస్టర్ను డిపో మేనేజర్ ఆవిష్కరించారు. ఈ సదవకాశాన్ని ప్రయాణికులు భక్తులు వినియోగించుకోవాలని ఆయన కోరారు. మరిన్ని వివరాలకు 6301151730 నెంబర్ కు సంప్రదించాలన్నారు.