TPT: గూడూరు 2వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో లైంగిక వేధింపుల కేసులో ముద్దాయికి మూడేళ్ల జైలు శిక్ష విధిస్తూ పోక్సో ప్రత్యేక న్యాయస్థానం తీర్పునిచ్చింది. గూడూరులోని ఓ పాఠశాల వద్ద 10వ తరగతి బాలికను జి.యేసు పదేపదే వేధించడం, లైంగిక వేధింపులు, బెదిరింపులకు పాల్పడడం పట్ల 2022లో కేసు నమోదైంది. ఈ ఘటనలో విచారణ జరిపిన న్యాయస్థానం తీర్పు ఇచ్చింది.