SRPT: హుజూర్నగర్లో ఈ నెల 25న నిర్వహించే జాబ్ మేళా మరుసటి రోజు 26 తేదీ కూడా కొనసాగించనున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నిరుద్యోగుల నమోదు 30 వేల వరకు ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. జాబ్ మేళాకు హాజరయ్యే అభ్యర్థులు ఈ విషయం గమనించాలని సూచించారు. మరుసటి రోజు కూడా భోజన, ఇతర వసతులు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు.