ASR: జీకేవీధి మండలం బంధవీధిలో పాఠశాల భవనం నిర్మించాలని విద్యార్థుల తల్లిదండ్రులు అధికారులను కోరుతున్నారు. గ్రామంలోని యూపీ పాఠశాలలో 50 మంది వరకు విద్యార్థులు చదుకుంటున్నారన్నారు. అయితే పాఠశాల భవనం లేక రేకులతో షెడ్డును నిర్మించామన్నారు. సంవత్సరాల తరబడి ఈ షెడ్డులోనే విద్యార్థులకు బోధన సాగుతుందని తెలిపారు. వర్షాకాలం కావడంతో పిల్లల చదువుకు అంతరాయం కలుగుతుందని పేర్కొన్నారు.