PPM: జిల్లాలోని ప్రతి పాఠశాల, అంగన్వాడీ కేంద్రాల్లోని పిల్లలకు శుభ్రత పట్ల అవగాహన కల్పించడమే ముస్తాబు కార్యక్రమం ఉద్దేశ్యమని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పేర్కొన్నారు. శుక్రవారం సాలూరు మండలం కొత్తవలస గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలిక పాఠశాలలో ముస్తాబు కార్యక్రమాన్ని కలెక్టర్ డా. ప్రభాకర రెడ్డితో కలిసి ప్రారంభించారు.