MDCL: పేదవాడి సొంతింటి కలను కాంగ్రెస్ ప్రభుత్వం నిజం చేస్తుందని మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్ అన్నారు. ఘట్కేసర్ మున్సిపల్ పరిధిలోని ఘనపురం, లింగపురాలలో ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో పేదలకు న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు.