CTR: పాలసముద్రం(M) వనదుర్గాపురం పరిధి చలమరాజుడు గ్రామంలో ఆదివారం పెళ్లి భోజనం తిని 30 మంది అస్వస్థతకు గురయ్యారు. వివాహానికి హాజరైన వారంతా భోజనం తిన్న కాసేపటికే వాంతులు, విరోచనలు చేసుకున్నారు. సమాచారం అందుకున్న వైద్యుడు జయకుమార్, సీహెచ్ఓ సుబ్రహ్మణ్యాలు స్థానిక పాఠశాలలో పడకలు ఏర్పాటు చేసి వైద్యం అందించారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.