జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఇవాళ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అకాల వర్షాల కారణంగా ఏలేరు జలాశయం నిండు కొండల మారిందన్నారు. 2100 క్యూసేక్కులు నీరు దిగువకు వదిలితే కృష్ణవరం, ఎస్. తిమ్మాపురం, శృంగారాయుని పాలెం, భూపాలపట్నం, తదితర గ్రామాలకు ముంపు వాటిల్లే ప్రమాదం ఉందని కాబట్టి ఈ గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.