GNTR: బాపట్ల జిల్లా పిట్టలవానిపాలెంకు చెందిన 80 ఏళ్ల పిట్లూరి వెంకాయమ్మ గుంటూరులోని శారదాకాలనీలో శుక్రవారం ఒంటరిగా కనిపించారు. తన ఆటో డ్రైవర్ కొడుకే తనను ఇక్కడికి తీసుకొచ్చి వదిలేశాడని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో, పోలీసులు స్పందించి ఆ వృద్ధురాలికి ఆశ్రయం కల్పించాలని స్థానికులు కోరుతున్నారు.