KNR: కశ్మీర్ గడ్డలోని నూతన IVNM మార్కెట్ పనులను మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్ శుక్రవారం సంబంధిత అధికారులతో పరిశీలించారు. పనుల పురోగతిని సమీక్షించిన ఆయన, పనులలో వేగం పెంచి, నాణ్యతకు ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. రైతులకు మార్కెట్ త్వరగా అందుబాటులోకి తెచ్చేలా పనులను పూర్తి చేయాలని కమిషనర్ సూచించారు.