GNTR: పొన్నూరు మండలంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తహసీల్దార్ మహమ్మద్ జియావుల్ హక్ హెచ్చరించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఈనెల 27 నాటికి వాయుగుండంగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో అత్యవసర పనులు ఉంటే తప్ప ప్రజలు బయటకు రాకుండా ఇంట్లోనే సురక్షితంగా ఉండాలని ఆయన సూచించారు.