ATP: జిల్లా పరిషత్ కార్యాలయంలో జరిగిన నీటిపారుదల సలహా మండలి సమావేశంలో ఎమ్మెల్యే బండారు శ్రావణి పాల్గొన్నారు. శింగనమల మిడ్ పెన్నార్ డ్యామ్ మరమ్మతులు, కాలువల ఆధునీకరణకు రూ.5.20 కోట్లు మంజూరు చేసినందుకు సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తదితరులకు ధన్యవాదాలు తెలిపారు. చెరువుల నింపుదల, బ్రిడ్జి పునర్నిర్మాణం, లస్కర్ల నియామకం చేపట్టాలని కోరారు.