KRNL: ఆదోని వ్యవసాయ మార్కెట్ యార్డులో శుక్రవారం పత్తి, వేరుశనగ, ఆముదాల ధరలు ఇలా ఉన్నాయి. పత్తి క్వింటా కనిష్ఠ ధర రూ.4,000, గరిష్ఠ ధర రూ.7,499 పలికింది. వేరుశనగ కనిష్ఠ ధర రూ.3,399, గరిష్ఠ ధర రూ.5,849 వరకు నమోదైంది. ఆముదాలు కనిష్ఠ ధర రూ.4,655, గరిష్ఠ ధర రూ.5,994 వరకు అమ్ముడయ్యాయి. 10 రోజులుగా ధరలు తగ్గుముఖం పట్టడంతో రైతులు తీవ్ర ఆవేదనలో ఉన్నారు.