GNTR: ఆచార్య నాగార్జున యూనివర్సిటీ (ANU) పరిధిలో జులైలో జరిగిన నానో టెక్నాలజీ సెకండ్ సెమిస్టర్ పరీక్షా ఫలితాలను శుక్రవారం విడుదల చేశారు. రీవాల్యుయేషన్ కోసం విద్యార్థులు నవంబర్ 4వ తేదీ లోపు ఒక్కో సబ్జెక్టుకు రూ.1,860 చెల్లించి దరఖాస్తు చేసుకోవాలని పరీక్షల నియంత్రణ అధికారి శివప్రసాదరావు తెలిపారు. పూర్తి వివరాలకు వర్సిటీ అధికారులను సంప్రదించవచాలని ఆయన సూచించారు.