WG: నరసాపురంలోని 29వ వార్డులోని స్థానిక కళాశాల సమీపంలో నిడదవోలు నుంచి మొగల్తూరు వెళ్లే పంట కాలువలో శుక్రవారం గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. నరసాపురం ఎస్సై ఎస్.ఎన్ ముత్యాలరావు మృతదేహాన్ని పరిశీలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామన్నారు. మృతదేహానికి సంబంధించి ఎవరికైనా సమాచారం తెలిస్తే పోలీసులను సంప్రదించాలన్నారు.