ప్రకాశం: ఒంగోలులోని ఏకేవీకే డిగ్రీ కళాశాలలో శనివారం ఉదయం 10 గంటలకు మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు స్కిల్ డెవలప్మెంట్ అధికారి రవితేజ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ఇంటర్ నుంచి పీజీ వరకు చదివిన నిరుద్యోగులు జాబ్ మేళాలో పాల్గొనవచ్చని తెలియజేశారు. మొత్తం వెయ్యికి పైగా జాబ్స్ ఖాళీగా ఉన్నట్లు తెలిపారు. నిరుద్యోగ యువతీ యువకులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.