TPT: ఎర్రావారిపాళ్యం మండల పరిధిలోని తలకోన సిద్ధేశ్వర స్వామి వారి ఆలయంలో ఆలయ అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఈ పనులను శుక్రవారం ఎమ్మెల్యే పులివర్తి నాని పరిశీలించారు. ఇందులో భాగంగా నాణ్యతతో కూడిన నిర్మాణాలు చేపట్టాలని అధికారులను, కాంట్రాక్టర్ను ఆదేశించారు. అనంతరం ఆయన స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.