NLR: భైరవకోనలో నాలుగు రోజులుగా కురిసిన భారీ వర్షాలకు వాటర్ ఫాల్స్ (జలపాతం) ఉద్ధృతంగా ప్రవహిస్తుందని సి. ఎస్. పురం ఎస్సై వెంకటేశ్వర నాయక్ తెలిపారు. సుదూర ప్రాంతాల నుంచి భైరవకోనకు వచ్చే భక్తులు, అయ్యప్ప మాలధారణ స్వాములు, పర్యాటకులు వర్షాలు తగ్గేవరకు రావద్దని ఆయన సూచించారు. దైవ దర్శనం, జలపాతం ప్రవేశాన్ని తాత్కాలికంగా నిలిపివేసినట్లు ఆయన పేర్కొన్నారు.