NZB: చట్ట వ్యతిరేక కార్యకలాపాలు, సెటిల్ మెంట్లకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని టౌన్ సీఐ శ్రీనివాస్ రాజ్ హెచ్చరించారు. సీపీ ఆదేశానుసారం టూ టౌన్, నాలుగో టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రౌడీషీటర్లకు శుక్రవారం సాయంత్రం కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సత్ప్రవర్తనతో మెలిగే వారి పైన రౌడీ షీట్లు క్లోజ్ చేస్తామన్నారు.