SRCL: చందుర్తి మండలం సనుగుల దేవుని తండా అంగన్వాడి కేంద్రం టీచర్ గొట్టె పరిమళ (39) శనివారం ఉదయం ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. గత 23 సంవత్సరాలుగా అంగన్వాడి టీచర్‌గా పని చేస్తూ మంచి పేరు సంపాదించుకుంది. అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులతో రోజురోజుకు తీవ్ర మానసిక వేదనకు లోనైంది. దీంతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.