SKLM: రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వ పాలనలో గ్రామస్థాయిలో మద్యం ఏరులై పారుతుందని వైసీపీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ సభ్యులు, పాతపట్నం మాజీ శాసనసభ్యురాలు రెడ్డి శాంతి ఆగ్రహం వ్యక్తతం చేశారు. ఎన్నికల ముందు మద్య నిషేధాన్ని అమలు చేస్తామని ప్రగల్బాలు పలికిన చంద్రబాబు నాయుడు పల్లె పల్లెకు, ఇంటింటికి మద్యం అందజేయడమే లక్ష్యంగా భావిస్తున్నారని పేర్కొన్నారు.