SS: పుట్టపర్తి కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఆధ్వర్యంలో మత్తు పదార్థాల నివారణపై ఈగల్ కమిటీ సమన్వయ సమావేశం జరిగింది. జిల్లా కలెక్టర్ ఏ. శ్యాంప్రసాద్ పాల్గొని టోల్ ఫ్రీ నంబర్లపై అవగాహన పోస్టర్లను ఎస్పీతో కలిసి ఆవిష్కరించారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. సమావేశంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.