కోనసీమ: ఆలమూరు మండలం చింతలూరు మండల ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ఆలమూరు ఎంపీడీవో ఎ. రాజు, మండల విద్యాశాఖ అధికారి బి. అప్పాజీ చేతుల మీదుగా రైన్ కోట్లు అందచేశారు. ఏడిద గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు వాసంశెట్టి శేషు కుమార్ విద్యార్థులు పాఠశాలకు వచ్చే సమయంలో వర్షం వలన ఇబ్బంది పడకుండా ఉండాలనే ఉద్దేశంతో రైన్ కోట్లును సమకూర్చారు.