WGL: రైల్లో పోగొట్టుకున్న హ్యాండ్ బ్యాగ్‌ను పోలీసులు ప్రయాణికుడికి WGL రైల్వేస్టేషన్లో అందించారు. విశాఖపట్టణానికి చెందిన వెంకటరావు(34) తన భార్య స్వాతితో కలిసి బిలాస్పూర్ రైలులో ప్రయాణిస్తూ విజయవాడలో తమ బ్యాగ్ మరిచిపోయి దిగారు. విధుల్లో ఉన్న WGL GRPపోలీసులు ఆ బ్యాగ్ స్వాధీనం చేసుకున్నారు. బ్యాగులో ఉన్న ఫోన్ ఆధారంగా బాధితులను గుర్తించి, వారికి అందించారు.