మహిళల వన్డే ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, ఇంగ్లండ్ జట్లతో పాటు, భారత్ కూడా సెమీఫైనల్‌కు చేరుకుంది. అయితే, అన్ని జట్లకు కూడా మరో లీగ్ మ్యాచ్ మిగిలి ఉంది. ఈ చివరి లీగ్ మ్యాచ్‌ల ఫలితాల ఆధారంగానే సెమీస్‌లో ఏ జట్టు ఎవరితో తలపడుతుందో ఖరారు కానుంది. భారత్ మాత్రం తన చివరి మ్యాచ్‌లో గెలిచినా కూడా నాలుగో స్థానంలోనే ఉండనుంది.