MNCL: బెల్లంపల్లి 29వ వార్డులో నిరూపయోగంగా ఉన్న మంచి నీటి ట్యాంకును తొలగించాలని JAC నాయకులు కోరారు. శుక్రవారం సబ్ కలెక్టర్ మనోజ్చకు వినతిపత్రం అందజేశారు. నాయకులు మాట్లాడుతూ.. కొన్ని సంవత్సరాలుగా నిరుపయోగంగా ఉన్న నీటి ట్యాంకు శిథిలావస్థకు చేరిందన్నారు. శిథిలావస్థకు చేరిన నీటి ట్యాంకు వలన ప్రమాదం చోటుచేసుకునే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.