AP: కర్నూలు జిల్లా ప్రమాదంపై కావేరి ట్రావెల్స్ సంస్థ యజమాని వెంకటేశ్వర్లు స్పందించారు. బస్సు పూర్తి కండిషన్లో ఉందని స్పష్టం చేశారు. వర్షం పడుతున్నప్పుడు అకస్మాత్తుగా బైక్ దూసుకుని రావడంతో ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు. అయితే డోర్ వద్ద మంటలు చెలరేగడంతో ప్రయాణికులు బయటపడలేకపోయారన్నారు. డ్రైవర్లు బస్సు అద్దాలను పగలగొట్టి ప్రయాణికులను రక్షించారని వెల్లడించారు.