SKLM: మందస మండలం హరిపురం ప్రభుత్వ ఆసుపత్రిని పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష శుక్రవారం ఆకస్మికంగా పరిశీలించారు. ఈ మేరకు ఆసుపత్రిలో రోగులు, వైద్యులు, సిబ్బంది తీరును తెలుసుకున్నారు. రోగులతో మాట్లాడి అందిస్తున్న వైద్యం గురించి ఆరా తీశారు. వైద్యులు, సిబ్బందితో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రోగులకు మెరుగైన వైద్యం అందించాలన్నారు.