W.G: తణుకులో భారీ వర్షాలు నేపథ్యంలో మున్సిపల్ అధికారులు అప్రమత్తమయ్యారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తాయని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు తణుకు పట్టణంలో ప్రధాన డ్రైనేజీలు పొంగి ప్రవహిస్తున్నాయి. తణుకు మున్సిపల్ కమిషనర్ రామ్ కుమార్ పర్యవేక్షిస్తున్నారు.