అనంతపురం: గుమ్మగట్ట మండలం బైరవాని తిప్ప ప్రాజెక్టును రాయదుర్గం ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు, కళ్యాణదుర్గం ఎమ్మెల్యే సురేంద్రబాబు శుక్రవారం సందర్శించారు. ఎగువ కర్ణాటక రాష్ట్రంలో భారీ వర్షం కురుస్తున్న నేపథ్యంలో ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతోంది. ప్రాజెక్టు సామర్థ్యం 1655 అడుగులు కాగా ప్రస్తుతం 1652.5 అడుగులకు నీరు చేరింది.