BPT: శుక్రవారం తెల్లవారుజామున జరిగిన కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో పర్చూరు నియోజకవర్గం పూసపాడు గ్రామానికి చెందిన ఘనమనేని ధాత్రి మృతి చెందింది. బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ హైదరాబాదు నుండి బెంగళూరు వెళుతుండగా ఈ ఘటన జరిగింది. ఈ సందర్భంగా ఆమె మృతి పట్ల ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ద్విగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలిపారు