అనంతపురం: తమ కూటమి పాలనలోనే భైరవాణి తిప్ప ప్రాజెక్టుకు కృష్ణా జలాలను తీసుకొచ్చి తీరుతామని రాయదుర్గం ఎమ్మెల్యే కాలువ, కళ్యాణదుర్గం ఎమ్మెల్యే సురేంద్రబాబు మరోసారి హామీ ఇచ్చారు. శుక్రవారం ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు కళ్యాణదుర్గం ఎమ్మెల్యేతో కలిసి బైరవాని తిప్ప ప్రాజెక్టును సందర్శించి రైతులతో మాట్లాడారు. నీటిని ఎప్పుడు విడుదల చేస్తామన్నది త్వరలో తెలుపుతామన్నారు.