TG: కర్నూలు బస్సు ప్రమాద బాధితులకు తెలంగాణ ప్రభుత్వం ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున పరిహారం అందిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. గాయపడిన వారికి రూ. 2లక్షల చొప్పున ఇస్తామని ప్రకటించారు. కాగా, ఈ ప్రమాదంలో బైకర్ సహా 20 మంది మరణించిన విషయం తెలిసిందే.