NLG: హైదరాబాద్ పరిసరాల్లో వర్షాలు కురవడంతో మూసీ ప్రాజెక్టుకు వరద ప్రవాహం పెరిగింది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 2,551.83 క్యూసెక్కుల నీరు చేరుతుండగా, అధికారులు ఒక గేటును 2 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ప్రాజెక్టు పూర్తి నీటిమట్టం 645 అడుగులు కాగా, ప్రస్తుతం 644.50 అడుగుల వద్ద నీరు నిల్వ ఉందని అధికారి మధు తెలిపారు.